పట్టభద్రుల ఓటరు నమోదుకు సర్పంచ్ పిలుపు!
గణపురం, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. ఆదివారం
కోఆర్డినేటర్లు బోనాల రాజమౌళి, దూలం కుమారస్వామి ల ఆధ్వర్యంలో ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫారం-18 ఓటరు నమోదు సహాయ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినవారు సైతం ఈసారి తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 వరకు గడువు ఉన్నందున అర్హులైన పట్టభద్రులు డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్, ఫొటోలతో శిబిరానికి హాజరై నమోదు చేసుకోవాలని కోరారు.