బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా చెవుల రాకేష్

25-10-2026 | 06:20pm

స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): స్టేషన్ ఘన్ పూర్ మండలం(Station Ghanpur Mandal) కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన గ్రామస్థాయి సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా చెవుల రాకేష్(Chevula Rakesh) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీ అధ్యక్షుడు - చెవుల రాకేష్, ఉపాధ్యక్షుడు - గోవిందు లింగస్వామి, కోశాధికారి - గంగుల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి - రంగు రమేష్, అధికార ప్రతినిధి - మాజీ ఉప సర్పంచ్ గండి రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ - మారబోయిన దశరథ్, గౌరవ సలహాదారులుగా మారబోయిన యాకరాజు, గోవిందు అశోక్, గౌరవ అధ్యక్షులుగా పులిగిల్ల రవీందర్, బాబు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ నాయకత్వం అంటే పదవి కాదని, ప్రజాసేవేనని, తనకు పదవి కల్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముక్కెర మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు