ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా డైరెక్టర్ ను సన్మానించిన గిరిజన నాయకులు
01-10-2026 | 06:54pm
కోదాడ అక్టోబర్ 01(విజయ క్రాంతి): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(Indian Red Cross Society ) జిల్లా డైరెక్టర్‌గా కోదాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, సీనియర్ సర్జన్, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ దశరథ్(Dr. Dasharath) నియమితులయ్యారు. గురువారం గిరిజన నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో డాక్టర్ దశరథ్ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్య కోట్యా నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉప అధ్యక్షుడు రాజు నాయక్, జిల్లా అధ్యక్షుడు భూక్య రవి నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకుడు బాణోతు నందాలాల్, రాంప్రసాద్, చంద్రశేఖర్, భూక్యా నిఖిల్, నాగేందర్, భద్రు, వాసు, గోపి రాధోడ్, బాలు తదితరులు పాల్గొన్నారు.