టీఆర్పీలో భారీ చేరికలు

01-10-2026 | 08:37pm

బెల్లంపల్లి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ అధ్యక్షతన, సత్రవేణి వెంకటేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి(Bellampalli) ప్రాంతానికి చెందిన పలువురు యువకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన యువతకు జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ... యువత రాజకీయాల్లో(Politics) చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా యువ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఆత్మగౌరవంతో తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) నాయకత్వంలో రాజ్యాధికార సాధన కోసం పనిచేద్దామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు వారి జనాభా, సామాజిక ప్రాతినిధ్యానికి అనుగుణంగా అవకాశాలు  వాటా లభించాలనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని మహేష్ వర్మ పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగడం ద్వారా స్థానిక సమస్యలు, ఉపాధి, విద్య, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై మరింత చర్చ జరగడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ, తమ ప్రాంతంలోని ప్రజా సమస్యలపై పనిచేస్తామని, పార్టీ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన యువకులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు