దుర్గామాతకు సూదగాని హరిశంకర్ గౌడ్ ప్రత్యేక పూజలు
ఆలేరు, అక్టోబర్ 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district) మోటకొండూర్ మండల కేంద్రంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని సూదగాని ఫౌండేషన్ చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు, భక్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గామాతను ప్రార్థించారు.
హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్, హనుమాన్ యూత్ సభ్యులు ఆలేటి నాగరాజు, భూమండ్ల శివకుమార్, రేగు చంద్రశేఖర్, బాల్ద ఇస్తారి, ఆలేటి ఉమేష్, బాలరాజు, వంగపల్లి మహేందర్, జూకంటి మధు తదితరులు పాల్గొన్నారు.