ఎంపీ నిధులతో రెండు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్కు గ్రామస్తుల కృతజ్ఞతలు
నాగల్గిద్ద, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండల పరిధిలోని శేరి దామరగిద్ద గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శెట్కర్(MP Suresh Kumar Shetkar) నిధులతో రెండు హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని చర్చి సమీపంలో ఒకటి, శివాలయం వద్ద మరొకటి ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో రాత్రివేళ వెలుతురు సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తూ హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్కు గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలగే రాజు, మాజీ ఎంపీటీసీ శేరికర్ పండరీనాథ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బసవరాజ్ పాటిల్, తూర్పే చంద్రకాంత్, ఎండీ ఖాజా పాషా, శ్రీకాంత్, గ్రామ పెద్దలు శేరికర్ శరణప్ప, పట్లోళ్ల వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ పాటిల్, పట్నం లాలప్ప, ప్రేమ్ పాటిల్, టి.అశోక్, చిల్లపల్లి శంకర్, తూర్పే శివరాజ్, తూర్పే శ్రీకాంత్, దేవిదాస్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు.