డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు పాటించాలి: ఎస్సై అనిల్
19-10-2026 | 10:43pm
భిక్కనూర్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని భిక్కనూర్ ఎస్‌ఐ అనిల్(SI Anil) స్పష్టం చేశారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాల దుర్గామాత మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. శోభాయాత్రలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా, శాంతిభద్రతలకు విఘాతం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పోలీసుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులకు సహకరించాలని నిర్వాహకులకు సూచించారు.