సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

18-10-2026 | 08:53pm

టేకులపల్లి, (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు(Saddula Bathukamma Celebrations) అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(Illandu MLA Koram Kanakaiah) పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది.

మరిన్ని వార్తలు