వినోబాబావే కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
18-10-2026 | 10:30pm
ఇల్లెందు టౌన్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను(Bathukamma festival celebrations) ఇల్లెందు పట్టణంలోని(Illendu town) వినోబాబావే కాలనీలో మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.