ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న సాయిబాను
చుంచుపల్లి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భారత రక్తదాన సేవా మిషన్ అసోసియేషన్ నుంచి బెస్ట్ ఎక్సలెన్స్ సోషల్ సర్వీస్ అవార్డు(Best Excellence Social Service Award) 2026 అవార్డును ఆత్మకూరు బోనగిరిలో అందుకున్న సాయిబాను. తన సోషల్ సర్వీస్ ని గుర్తించి ఈ అవార్డుని ప్రధానం చేయడం జరిగింది. సమాజ సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉచితంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంపవర్ మెంట్ ఆఫ్ ది ఉమెన్స్ వారియర్ సొసైటీలో పనిచేస్తూ మహిళలకు ఉచిత బ్యూటిషన్ కోర్స్ నేర్పిస్తూ, హ్యూమన్ రైట్స్ సొసైటీ(Human Rights Society)లో ఉమెన్ వింగ్ కోఆర్డినేటర్ గా పని చేస్తూ తమ హక్కుల కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వృద్ధులకు అనాధలకు ఒంటరిగా జీవనం సాగిస్తున్న అందరికీ ఆమె తన వంతు తన సహకారం చేసుకుంటూ వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతం చాలా వెనుకబడిన జిల్లా అలాంటి జిల్లా నుంచి హైదరాబాద్ అంత స్థాయికి తన కష్టంతో చేరుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం. ఇటువంటి అవార్డ్స్ తను ఇంతకు ముందు కూడా చాలా అందుకున్నారు.
ఇటువంటి అవార్డ్స్ అందుకోవడం నిజంగా ఒక గొప్ప అద్భుతం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే గాని ఇలాంటి అవార్డ్స్ రావు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు నిజంగా తనకు దక్కిన అదృష్టం. తను చేసే సహాయంలో మిగతావారు కూడా తనకు సహాయం చేస్తూ తమకు తోచిన సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ అవార్డును అందజేసిన వారు భారత రక్తదాన్ సేవ మిషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్, వైస్ ప్రెసిడెంట్ బాబు, జనరల్ సెక్రటరీ హేమంత్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు పాల్గొనడం జరిగింది.