లింగాపురం రైతుల కష్టం తీర్చిన దేవుడు
బండారి రామకృష్ణ
చర్ల, విజయ క్రాంతి: చర్ల మండలం(Charla Mandal) లింగాపురం గ్రామపంచాయతీ(Lingapuram Gram Panchayat) పరిధిలోని ఇసుకపాయలో గోతులు, నీళ్లు నిలవడంతో కోరేగడ్డ వైపు వ్యవసాయ పనులకు(Agricultural activities) వెళ్లే చాలా మంది రైతులు(Farmers), కూలీలు(farm laborers) రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు(Senior Congress party leaders) లింగాపురం గ్రామ పెద్ద బండారి రామకృష్ణ తన సొంత ఖర్చులతో జేసీబీ పెట్టించి, ఇసుకపాయలోని నీళ్లను తొలగించి, గోతులను పూడ్చి రోడ్డులా చదును చేయించారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే సమస్య వస్తుందని, ప్రతిసారీ రామకృష్ణ గారే పెద్ద మనసుతో ముందుకు వచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు కొనియాడుతున్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన బండారి రామకృష్ణ కి రైతుల తరఫున, లింగాపురం ప్రజల తరఫున, యూత్ తరఫున ఉప సర్పంచ్ నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. లింగాపురానికి ఆయన దేవుడిలాంటి వారని ప్రశంసించారు.