సీనియర్ జర్నలిస్టును సన్మానించిన
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల ఏర్పాటు నేటికీ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) ఆదివారం పలువురిని ఘనంగా సన్మానించారు. కామారెడ్డి(Kamareddy) లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్(Gampa Govardhan) . హనుమంత్ షిండేలు తెలంగాణ ఉద్యమంలో(Telangana Movement) సేవలందించిన ఉద్యమకారులతో పాటు జర్నలిస్టులు, కళాకారులను(Artists) సన్మానించారు.
దీంట్లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ ముదాం వెంకన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ముజుబుద్దిన్, ప్రేమ్ కుమార్, కుంబాల రవి, జూకంటి ప్రభాకర్ రెడ్డి, రాంరెడ్డి, హనుమాన్లు, బలవంతరావు , అంధ్యాల రమేష్ , అంజిరెడ్డి, నర్సింలు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.