కూసుమంచి ప్రయాణికుల సమస్యలు పరిష్కారం చేయండి
కూసుమంచి సర్పంచ్ కృష్ణవేణి, టీడబ్ల్యుయంఎఫ్ జిల్లా ఇంచార్జీ గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి
కూసుమంచి, అక్టోబర్ 11(విజయక్రాంతి): కూసుమంచి మండల(Kusumanchi Mandal) కేంద్రంలో ప్రయాణికులు కింది సమస్యల పట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కి స్థానిక సర్పంచ్ కొండా కృష్ణవేణిమహిపాల్, వార్డు మెంబర్ల కమిటీ అధ్యక్షుడు గుండా ఉపేందర్ రెడ్డి కూసుమంచి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వినతి పత్రం అందజేశారు.
కూసుమంచి లో గత వారం రోజుల నుంచి ప్రయాణికుల నుండి సేకరించిన సంతకాలతో పాటు . ఖమ్మం – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సర్వీసుల రద్దు చేయడం వలన అనునిత్యం ఉదయం హైద్రాబాద్ హాస్పిటల్ కు వెళ్ళే వారు, హైద్రాబాద్ లో విద్యను అభ్యసించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కూసుమంచి మండల కేంద్రంలో బస్ స్టాండ్ లేకపోవడం వలన ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు గర్భిణులు , పిల్లలు, వృద్దులు వారికి కనీసం ఎండకు, వానకు నిల్చునే అవకాశం లేకపోవడం తో వారి ఇబ్బందులు పడుతున్నారని, షెల్టర్ ఏర్పాటు చేయాలని లేదా గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో మంత్రి స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య, కొక్కిరేణి వెంకన్న, గంజి ఉదయ్ కుమార్, పిట్టల వేణు, అడపా శివ, బద్దం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు