యువతకు పథకాలు అందించాలి

11-10-2026 | 05:30pm

నిర్మల్ అక్టోబర్ 11 ( విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) ప్రకటించిన సంక్షేమ పథకాలను(Welfare schemes)  చేయకుండా అర్హులైన నిరుపేదలకు వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) జిల్లా అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. గత ఏడాది జూన్‌ 2న నిరుపేద యువతకు రుణాలు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా నవంబర్‌ 19న రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని(Rajiv Yuva Vikasam Yojana) అమలు చేస్తామని ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు బీసీ మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ పంపిణీపై స్పష్టత లేదన్నారు. కుట్టుమిషన్ల పంపిణీ ఎప్పుడు చేపడతారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. విజయదశమిలోపు బీసీ మహిళలకు కుట్టుమిషన్లు, దీపావళిలోపు నిరుపేద కుటుంబాలకు రుణాలు అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు