గ్రామపంచాయతీ భవనానికి స్లాబ్ నిర్మాణం

11-10-2026 | 05:28pm

తాడ్వాయి,అక్టోబర్,11 ( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం నందివాడ గ్రామపంచాయతీ భవన(Nandivada Gram Panchayat building) నిర్మాణానికి ఆదివారం ఫ్లాబ్ నిర్మించారు. స్లాబ్ నిర్మాణం కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ సంకు పోచయ్య మాట్లాడుతూ... భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. గ్రామపంచాయతీకి సరైన భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, వీడిసి అధ్యక్షులు కంకణాల బాల్ చంద్రం, వార్డ్ సభ్యులు కాన్షిరామ్,దత్తు రెడ్డి, నాయకులు గుండప్ప గారి మహేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు