సింగరేణిలో భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి వేడుకలు

11-10-2026 | 05:26pm

తొమ్మిది రోజులపాటు శరన్నవరాత్రి ఉత్సవాలు....

జీఎం కార్యాలయంలో ప్రత్యేక పూజలు..

 కొత్తగూడెం అక్టోబర్ 11 విజయక్రాంతి :  సింగరేణి కొత్తగూడెం ఏరియా(Singareni Kothagudem Area) పరిధిలోని గనులు, ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులు(Mines and Opencast Projects), వివిధ డిపార్ట్‌మెంట్లలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆదివారం భక్తిశ్రద్ధలతో(devotion) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకటరమణ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తొమ్మిది రోజులపాటు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కార్మికులు, అధికారులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించనున్నారు. ఆయా గనులు, కార్యాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా జీఎం సీహెచ్‌ వెంకటరమణ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలని, కార్మికులు, అధికారులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను అందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం గోవిందరావు, ఏరియా ఇంజనీర్ రామకృష్ణ, డీజీఎం సివిల్ రామకృష్ణ, మజ్జి మురళి, కమిటీ సభ్యులు సాగర్ ,రామకృష్ణ ,వినయ్ చంద్రావతి, భరత్, రామ్ చందర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు