7 September, 2026 | 10:13 AM

వంటింటిలో ధర ల మంట

07-09-2026 | 08:58am

* చక్కెర కిలోకు 72కు పైగానే..

* ఉల్లిగడ్డ కిలో ₹ 70...

* వెల్లుల్లి కిలోకు  ₹200 కు పైగానే.. 

* ఒక్క కుటుంబానికి  నెలకు 1000 నుండి 2000 అదనపు భారం

 ఉట్నూర్, సెప్టెంబర్ 06( విజయక్రాంతి ):   ఓవైపు ఎల్ నినో(El Nino)  ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో(During the Kharif season)  సాగు చేసిన పంటలపై  దిగుబడి వస్తుందో రాదో అనే బెంగతో రైతులు ప్రజలు ఉన్నారు. మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు  వ్యాపారులు రోజురోజుకు పెంచుతున్నారు. బియ్యం మొదలు  పప్పులు, బెల్లం, చక్కెరలతో పాటు ఉల్లి నుంచి వెల్లుల్లి.. మంచి నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి తాకుతున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాల పైన  పెను భారం పడుతుంది.

నిత్యావసరాల ధరలు   రోజురోజుకు  ఇష్టారాజ్యంగా  పెంచుతున్న  ధరల నియంత్రణ కమిటీ కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పెరుగుతున్న ధరలు నియంత్రణపై  సమావేశాలు నిర్వహించకుండా అధికారులు సైతం  పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా  రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసరాల ధరలను  అరికట్టుటకు  అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు