మామునూరు పేట చెరువు టూరిజం పనుల పరిశీలన
07-09-2026 | 08:54am
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మండల పరిధిలోని మామునూరు పేట చెరువు టూరిజం పనుల(Tourism work)ను ఆదివారం నాడు సంబంధిత శాఖ ఏఈ(AE) నరేష్ తో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పరిశీలించారు.మామునూరు పేటచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 4-86 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు.
అట్టి పనులను సంబంధిత శాఖ ఏ ఈ నరేష్ తోకలిసి నిర్మాణపనులను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని,క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలని చూసించారు. వీరితోపాటు సర్పంచ్ షేక్ పెదబాబు సాహెబ్,పాశం రవి, లక్కిరెడ్డి అయ్యపురెడ్డి తదితరులు ఉన్నారు.






