7 September, 2026 | 10:12 AM

జంగంపల్లిలో వినూత్న నిరసన.. రోడ్లు శుభ్రం చేసిన గంప గోవర్ధన్‌

07-09-2026 | 09:11am

భిక్కనూర్, సెప్టెంబర్‌ 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భిక్కనూర్‌ మండలం జంగంపల్లిలో ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌(Gampa Govardhan), బీఆర్‌ఎస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌ స్వయంగా రోడ్లపైకి వచ్చి చెత్తను తొలగించి శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా గంప గోవర్ధన్‌(Gampa Govardhan) మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు