గురుకులంలో సమస్యలపై స్పందించిన కౌన్సిలర్ హకీం

13-09-2026 | 12:10am

విజయ క్రాంతి వరుస కథనాలకు స్పందన

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం కోయగుట్ట గురుకులంలో నెలకొన్న సమస్యలపై వార్డ్ కౌన్సిలర్ హకీం స్పందించారు. గురుకులంలో సమస్యలపై ఇటీవల విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలపై ఆయన స్పందించారు. శనివారం కొయ్యగుట్ట గురుకుల కళాశాలలో(Koyyagutta Gurukul College) పర్యటించి స్థానిక ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, సిబ్బంది, బోధన, బోధ నేతర సిబ్బందితో మాట్లాడారు.

వాతావరణంలో నెలకొంటున్న మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు కళాశాలలో నెలకొన్న నీటి ఎద్దడి, అపరిశుభ్రత, భోజనం ఏర్పాట్ల పై ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి నీళ్ల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం అందిస్తున్న అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు కాకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు