మొక్కల పెంపకం అందరి బాధ్యత..

12-09-2026 | 11:40pm

అల్లాపూర్ గ్రామ సర్పంచ్ నారాయణ 

మునిపల్లి,(విజయక్రాంతి): మొక్కలు నాటడం ముఖ్యం కాదు.. వాటిని పోషించడం కూడా అంతే బాధ్యతగా తీసుకుంటే భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడతాయని అల్లాపూర్ గ్రామ సర్పంచ్ అంకెన్ పల్లి నారాయణ తెలిపారు. ఇందులో భాగంగానే  గ్రామంలో ఉన్న పిల్లల పేరుతో సర్పంచ్ నారాయణ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి పోషణకు సహకరించాలని కోరారు. అలాగే గ్రామంలో పుట్టిన ఆడపిల్ల అయినా… మగపిల్లవాడు అయినా… ప్రతి చిన్నారి పేరుతో  ఒక మొక్కను నాటినట్టు తెలిపారు. నాటిన మొక్కలు సుమారు 25 రకాల పండ్ల మొక్కలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్,  కాంగ్రెస్ నాయకులు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు