రూపాయికి కష్టకాలం

07-10-2026 | 09:56am

డాలర్ ముందు రూపాయి బలహీనం.. మరో 10 పైసలు డౌన్!

ముంబై, అక్టోబర్ 7: దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో భారత రూపాయి(Rupee Falls Today) విలువ మరోసారి ఒత్తిడికి గురైంది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో US డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు తగ్గి 96.45 వద్ద నమోదైంది. మరోవైపు US Dollar Index (DXY) 102కు పైగా, కొన్ని నెలల గరిష్ఠ స్థాయిలకు సమీపంలో కొనసాగడం కూడా రూపాయిపై ప్రభావం చూపుతోంది.

డాలర్‌కు డిమాండ్ బలంగా ఉండటంతో USD INR Rateలో ఒత్తిడి కనిపిస్తోందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో అందరి దృష్టి ఇప్పుడు RBI Monetary Policy Decisionపై పడింది. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై Reserve Bank of India తీసుకునే నిర్ణయం రూపాయి కదలికలకు కీలక సంకేతాలు ఇవ్వొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో Rupee vs Dollar, RBI పాలసీ నిర్ణయం, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరిన్ని వార్తలు