ఆ 45 ఎకరాలు ఎక్కడ?
- ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో రీ సర్వే చేయాలి
- కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల రెవెన్యూ రికార్డులను సబ్మిట్ చేయాలని నోటీసులు ఇవ్వాలి
- సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని అర్హులైన పేదలకు పంచాలి
- తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం కాలనీ నిర్మించాలి: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) మర్కూక్ మండలం ఎర్రవల్లి(Erravalli), శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంగళవారం సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామల్లో సర్వే వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూ మి ఉండగా, రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు.
ఆ సర్వే నెంబర్‌లో 45 ఎకరాలు మిస్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. మిస్ అయిన 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. భూమి సరిహద్దులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు సబ్మిట్ చేయాలని అధికారులు నోటీసు లు జారీచేయనున్నారు.
సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వే నంబర్ 325లో తెలంగాణలో ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీ రుల కాలనీ నిర్మాణం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి సకల సౌకర్యాలతో జూన్ 2లోగా కాలనీ నిర్మాణం పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించాలన్నారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినిగియోంచే వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.