మ్యుటేషన్‌కు లంచం.. ప్లాన్ మొత్తం రివర్స్

07-10-2026 | 09:51am

మ్యుటేషన్‌కు లంచం.. ఏసీబీకి చిక్కిన సెక్రటరీ, కారోబార్.

సిద్దిపేట రూరల్,అక్టోబర్ 7: విజయకాంత్రి: రెండు ఇండ్ల మ్యుటేష న్ కోసం లంచం డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటూ సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ(Panchayat Secretary) సెక్రటరీ బి. అరుణ, కారోబార్ దాసరి సంతోష్ మంగళవారం ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు. జక్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన రెండు ఇండ్ల మ్యుటేషన్ కోసం పంచాయతీని సంప్రదించగా, అనుమతి మంజూరు చేయడానికి సెక్రటరీ, కారోబార్లు రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 15,000 ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధి కారులకు సమాచారం అందించాడు. కాగా, మంగళవారం ఉదయం గ్రామ పంచాయతీలో వారిద్దరూ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు