మనీవ్యూకి ఇంత డిమాండా..?
Moneyview IPO Day 3: ఇన్వెస్టర్లలో హీట్.. GMP 41%కి చేరింది!
Moneyview IPO: మనీవ్యూ ఐపీఓ బిడ్డింగ్‌కు సోమవారం చివరి రోజు(Moneyview IPO Day 3). ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపించగా.. గ్రే మార్కెట్‌లో కూడా ఈ ఐపీఓపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా GMP 41 శాతానికి చేరుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రూ.34 అప్పర్ ప్రైస్ బ్యాండ్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే.. ప్రస్తుతం ఉన్న GMP కొనసాగితే మనీవ్యూ షేర్లు సుమారు రూ.48 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ సంకేతాలు సూచిస్తున్నాయి. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 41 శాతం(Moneyview IPO GMP 41%) ప్రీమియం అవుతుంది. అయితే GMP అనేది అనధికారిక మార్కెట్ సూచిక మాత్రమే.. లిస్టింగ్ ధరకు ఇది హామీ కాదు.
6 రెట్లు దాటిన సబ్‌స్క్రిప్షన్
ఐపీఓ రెండో రోజు ముగిసే సమయానికి మొత్తం(Moneyview IPO GMP today) ఇష్యూ 6.01 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం 23.25 కోట్ల షేర్లకు ఆఫర్ ఉండగా.. ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 5.18 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా.. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) విభాగంలో ఏకంగా 15.41 రెట్ల సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగం మాత్రం 25 శాతం సబ్‌స్క్రిప్షన్ వద్ద ఉంది.
చివరి రోజు ఏం జరుగుతుంది?
బిడ్డింగ్ చివరి రోజుకు చేరుకోవడంతో మనీవ్యూ ఐపీఓపై ఇన్వెస్టర్ల దృష్టి మరింత పెరిగింది. ఒకవైపు బలమైన సబ్‌స్క్రిప్షన్.. మరోవైపు GMPలో పెరుగుదల కనిపిస్తుండటంతో ఈ ఐపీఓపై చర్చ జోరందుకుంది. అయితే GMP, సబ్‌స్క్రిప్షన్ డేటా ఆధారంగా మాత్రమే IPOలో దరఖాస్తు చేయాలా(Moneyview IPO should you apply) వద్దా అనే నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యాల్యుయేషన్, రిస్కులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను కూడా పరిశీలించడం అవసరం.