లిఫ్ట్ ఇరిగేషన్‌కు భూములు పరిహారం కోసం ఆవేదన

28-09-2026 | 12:00pm

మా భూమి ఎంత పోతుందో మాకు అంత నష్టపరిహారం ఇవ్వాలి

మా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం తీర్చాలని కోరుతున్నాము

మోతె, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): మండల పరిధిలోని బురకచర్ల గ్రామానికి చెందిన బండారు సంజీవరెడ్డికి సంబంధించిన భూమి సిరికొండ రెవెన్యూ పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్ పైప్‌లైన్ కోసం నిర్వహించిన సర్వేలో తమభూమి లిఫ్ట్ ఇరిగేషన్(Lift Irrigation) పరిధిలోకి తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. రైతు బండారు సంజీవరెడ్డికి సంబంధించిన సర్వే నంబర్(Survey Number) 192లో 17 కుంటల భూమి, అలాగే సర్వే నంబర్లు 194, 195, 196లో కలిపి 16 కుంటల భూమి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోకి తీసుకున్నట్లు బండారు సంజీవరెడ్డి 

సతీమణి బండారు పుష్పమ్మ పేర్కొన్నారు.లిఫ్ట్ ఇరిగేషన్ పైప్‌లైన్ కోసం తమ భూములను సర్వే చేసి ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటున్నప్పటికీ, తమ భూమి విస్తీర్ణానికి, భూమి విలువకు అనుగుణంగా నష్టపరిహారం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

“మా భూమి ఎంత పోతుందో మాకు అంత నష్టపరిహారం ఇవ్వాలి అని. మా న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం తీర్చాలి అని. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూములు ఇచ్చిన భూ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి” అని బండారు సంజీవరెడ్డి సతీమణి పుష్పమ్మ కోరుతున్నారు.లిఫ్ట్ ఇరిగేషన్ పైప్‌లైన్ కోసం భూములు కోల్పోతున్న తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు, సంబంధిత అధికారులు పరిగణనలోకి తీసుకొని భూమి విస్తీర్ణం, విలువకు అనుగుణంగా నష్టపరిహారం అందించి తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు