బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

28-09-2026 | 12:08pm

కంగ్టి ,సెప్టెంబర్ 28(విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రంలోని ఔరాద్ గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి బైక్‌పై ఔరాద్ నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.మార్గమధ్యంలోని కంగ్టి మండలం చాప్టా(Chapta) (కే) శివారు ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో హనుమంతుకు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమంతును కంగ్టి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు