కాలువ కల్వర్టుపై నుంచి పడి యువకుడి మృతి
చివ్వెంల,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు(Accidentally) కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మోతె మండలం(Mothe Mandal) భళ్లుతండాకు చెందిన సపావత్ ఉపేందర్ (24) ఉండ్రుగొండ సమీపంలోని స్వామినారాయణ స్కూల్ ఎదుట కాలువపై స్నేహితులతో కలిసి కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. ఈ ఘటనలో గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి(Suryapet Government Hospital)కి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వాంకుడోతు సైదులు ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.