పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి
20-09-2026 | 02:50pm
సుధాకీర్తి
అల్వాల్, సెప్టెంబర్ 20,(విజయక్రాంతి) : గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు రోజువారి ఆహారంలో తప్పనిసరిగా పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూపర్ వైజర్ సుధాకీర్తి(Supervisor Sudhakirthi) అన్నారు. సీడీపీవో స్వాఆదేశాల మేరకు శనివారం అల్వాల్ సెక్టార్ లోని శివానగర్ అంగన్ వాడి కేంద్రంలో పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సుధాకీర్తి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రతిరోజు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.