లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే

20-09-2026 | 03:06pm

సిద్దిపేట, సెప్టెంబర్ 20: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు ప్రపంచానికి ఇంజనీరింగ్ విభాగంలో (Engineering Department)మెలుకవలు నేర్పిన గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప రమేష్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని లయన్స్ భవన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీరింగ్ డే ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంజనీర్లు యాసాల శ్రీనివాస్, ఓర మల్లేశం, రచ్చ నరేందర్, ఎ. ప్రణయ్, షాబుద్దీన్ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు లగిసెట్టి నరసింహులు కార్యదర్శి శ్రీధర్ ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్, జోజి,  ప్రతినిధులు కొమురవెల్లి శేఖర్, నల్ల నాగరాజం, సురేష్ కుమార్, నరసింహారెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు