ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి

18-09-2026 | 12:24pm

ప్రైవేట్ స్కూల్లో ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి 

 మెట్లపై అదుపుతప్పి కిందపడ్డ విద్యార్థిని 

 చికిత్స పొందుతూ మృతి

షాద్ నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా(Rangareddy District) షాద్ నగర్ పట్టణం లోని ఇండియన్ హైట్స్ ప్రైవేట్ పాఠశాల(Indian Heights Private School) విషాదం చోటుచేసుకుంది, నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని వర్ణిక పాఠశాల మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితికి చేరుకుంది గమనించిన పాఠశాల యాజమాన్యం హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ విద్యార్థిని వర్ణిక మృతి చెందింది.  అప్పటివరకు తమతో ఉన్న  విద్యార్థిని మృతి(Student dies)తో స్కూల్ తో పాటు విద్యార్థిని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్ణిక కిందపద్ద దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి, స్కూల్ యాజమాన్యం తమకు సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుని కుటుంబ సభ్యులు.

మరిన్ని వార్తలు