కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణాధికారి ఆత్మహత్య

07-10-2026 | 02:50pm

సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆత్మహత్య చేసుకున్న ఏ ఈ ఓ 

కామారెడ్డి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ వ్యవసాయ విస్తీర్ణ అధికారి(Agricultural Extension Officer) తన సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంత మీది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్లకు చెందిన సావుసాని శ్యాంసుందర్ రెడ్డి(42) రాజంపేట మండలంలో ఏఈఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం డ్యూటీ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళగా కొద్దిసేపటికే ఫోను స్విచాఫ్ రావడంతో తండ్రీ కృష్ణారెడ్డి తో పాటు బంధువులు అతనికోసం వాకబ్ చేశారు.

వ్యవసాయ క్షేత్రం కు వెళ్లి చూడగా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సావుసాని కృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు శ్యాంసుందర్ రెడ్డి ఏ ఈ ఓ గా పనిచేస్తున్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి అందరితో కలుపుకొని గా ఉండేవాడని ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.

రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగంలోనే పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేక కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది. రాజంపేట ఎస్సై భువనేశ్వర్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు