ప్రేమమ్‌కు పదేళ్లు.. ఇప్పటికీ అదే మ్యాజిక్!
అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘ప్రేమమ్’(Premam Movie) విడుదలై నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. యూత్‌ను ఆకట్టుకోవడంతో పాటు నాగచైతన్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.
మలయాళంలో నివిన్ పాలీ(Nivin Pauly), సాయి పల్లవి జంటగా నటించిన ‘ప్రేమమ్’ (2015)కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు చందూ మొండేటి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ, పాత్రలు, సన్నివేశాల్లో మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందించారు.
ఇవి కూడా చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో హీరోయిన్ తమన్నా.. ప్రత్యేక దర్శనం
ప్రేమ, స్నేహం, కాలేజీ లైఫ్, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను మూడు దశల్లో చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా నాగచైతన్య నటన, కథనం, సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
2016లో విడుదలైన ‘ప్రేమమ్’.. ఇప్పుడు 2026లో తన ప్రయాణంలో 10 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. పదేళ్లు గడిచినా ఈ సినిమా పాటలు, ప్రేమకథ, కాలేజీ జ్ఞాపకాలు ప్రేక్షకుల మనసుల్లో ఇంకా తాజాగా ఉండటం విశేషం. ఒక తరం ప్రేమను, మరో తరం జ్ఞాపకాలను గుర్తుచేసే ‘ప్రేమమ్’.. పదేళ్లైనా అదే ఫీల్!