రోడ్డు విస్తరణ పనులలో చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించాలి

07-10-2026 | 03:01pm
  1. గదులు నిర్మాణం చేసి షటర్లు ఏర్పాటు చేయాలి
  2. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు జారీ చేసి  రక్షణ కల్పించాలి
  3. సీపీఎం జిల్లా కమిటి సభ్యులు దివ్వెల వీరయ్య,మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు

ఎర్రుపాలెం అక్టోబర్ 7 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం నాలుగు రోడ్ల విస్తరణ పనుల అభివృద్ధికి మేము వ్యతిరేకులం కాదని, దశాబ్దా కాలం నుండి రోడ్డు పక్కన పండ్లు, పూల కోట్లు,టిఫిన్ సెంటర్లు ,టీ కొట్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కూరగాయల, బడ్డీలు తోపుడు బల్లాలపై పలు వ్యాపారలు చేసే కార్మికులు రోడ్డు పక్కన వ్యాపారాలు చేస్తూ జీవనం కొన సాగిస్తున్నారన్నారు.

 రోడ్డు వెడల్పుకు అధికారులు మార్కింగ్ ఇచ్చి షాపులు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని వీటిని తొలగించి మేము ఎక్కడ వ్యాపారాలు చేసుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వీధి చిరు వ్యాపారులకు చట్టప్రకారం గుర్తించి, గుర్తింపు కార్డులు సర్టిఫికెట్లు అందించి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

రోడ్డు వెడల్పు పనులు చేపట్టకముందే మండల కేంద్రo ప్రధాన రింగ్ సెంటర్ ( చౌరస్తాలో) వ్యాపారుల కోసం స్థలం కేటాయించి షటర్లు నిర్మించి  వ్యాపారుల,కార్మికుల జీవనోపాధికి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దూదిగం బసవయ్య,దివ్వెల వీరాంజనేయులు, నక్కా పుల్లారావు చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు