సర్వమానవాళికి గురువు
ఉమాశేషారావు :
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్(Guru Nanak Dev). ఆ మతంలోని పదిమంది గురువుల్లో మొదటివారు. మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు, కులం పేరుతో వివక్ష, ఆర్థిక అసమానతలు, మూఢ నమ్మకాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న కాలంలో ప్రేమ, శాంతి, సమానత్వం, సోదరభావం, మానవసేవ అనే సందేశాలను సమాజానికి అందించారు. 1969 నవంబర్ 25న ప్రస్తుత పాకిస్థాన్‌లోని నంకానా సాహిబ్ ప్రాంతంలో ఆయన జన్మించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఆయన జయంతి నిర్వహిస్తారు.
ఈ వేడుకలను ప్రకాశ్ ఉత్సవ్‌గా, గురుపురబ్గా పిలుచుకుంటారు. ఆ రోజున గురుద్వారల్లో తెల్లవారుజాము అమృత వేళల్లో ప్రార్థనలు, భజనలు, కీర్తనలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేకంగా లంగర్, ఉచిత సామూహిక భోజనం ఆచరిస్తారు. కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరికీ సమానంగా ఆహారం అందించడం ద్వారా సేవాభావం, సమానత్వాన్ని చాటుతారు. గురునానక్ బోధనలు మానవాళికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
హిందు, ముస్లిం భేదాలు లేకుండా మానవులంతా ఒక్కటేనని, భగవంతుడు ఒక్కడేనని సందేశమిచ్చారు. కష్టపడి పనిచేయాలని, న్యాయబద్ధంగా సంపాదించాలని, అందులో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి వినియోగించాలని బోధించారు. అహంకారాన్ని విడిచిపెట్టి, మనలోని దుర్గుణాలను తొలగించుకొని ఐకమత్యం, సోదరభావం, సమానత్వం, ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని సూచించారు. ప్రజలందరూ గురునానక్ ఉపదేశాలను ఆచరించగలిగితే చిక్కుల్లేని సమాజం సృష్టించబడుతుంది.
వ్యాసకర్త : వైద్య లెక్చరర్ ఇన్ సీవీక్స్, 9440408080