డీఈఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
పలువురికి పురస్కారాలు ప్రదానం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్(Deaf Enable Foundation) (డీఈఎఫ్) 17వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆదివారం హైదరాబాద్లోని(Hyderabad) కింగ్ కోఠి భారతీ య విద్యాభవన్ ఆడిటోరియంలో(Bharatiya Vidya Bhavan Auditorium, King Kothi) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బధిర సమాజంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులు(Students, teachers), వివిధ రంగాల్లో విశేష సేవలందించిన బధిరులను డీఈఎఫ్హెలెన్ కెల్లర్ పురస్కారాలు2026తో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదాయపు పన్ను శాఖ విశ్రాంత అ దనపు కమిషనర్ ఆర్. మోహన్ కుమార్, ఐ ఆర్ఎస్, దివ్యాంగుల సాధికారత శాఖ స హా య సంచాలకులు ఎ. రాజేందర్ గౌరవ అతిథులుగా, పీఎంజే జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జైన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు.
డీఈఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు టీకేఎం సందీప్ మాట్లాడుతూ బధిరులు స్వ తంత్రంగా జీవించేందుకు విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ఎంతో ముఖ్యమన్నారు. హైదరాబాద్లోని తొమ్మిది పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల్లో విశేష సేవలందించినవారితో పాటు చదువులో ప్రతిభ కనబరిచిన బధిర విద్యార్థులకు డీఈఎఫ్హెలెన్ కెల్లర్ పురస్కారాలు అందజేశారు. ఈ సంస్థ సికింద్రాబాద్లోని ఎస్డి రోడ్డులో నవకేతన్ కాంప్లెక్స్, 710వ నంబర్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.