హైదరాబాద్‌లో ఆర్థ్రోప్లాస్టీ కాన్ఫరెన్స్
వచ్చే ఏడాది మార్చిలో 4వ వార్షికోత్సవం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలో(Joint replacement treatment) ఆధునిక పద్ధతులు, రోబోటిక్ సర్జరీ(Robotic Surgery), సంక్లిష్టమైన హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలపై యువ ఆర్థోపెడిక్ సర్జన్లకు శిక్షణ అందించే లక్ష్యంతో 4వ వార్షిక ఆర్థ్రోప్లాస్టీ కాన్ఫరెన్స్‌ను 2027 మార్చి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాన్ఫరెన్స్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఇండియన్ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్(Indian Arthroplasty Association), తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.
డాక్టర్ దశరథ రామారెడ్డి ఆర్గనైజింగ్ చైర్మన్‌గా, సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్క్ చెందిన డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని ఆర్గనైజింగ్ సెక్రటరీగా, డాక్టర్ కృష్ణకిరణ్ ఇచ్చంపాటి సైంటిఫిక్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ.. జాయింట్ రీప్లేస్మెంట్ రంగంలో 25 నుంచి 30 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల జ్ఞానాన్ని యువ వైద్యులతో పంచుకోవడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
దేశవ్యాప్తంగా సుమారు 150 మంది అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు పాల్గొని తాజా వైద్య పరిణామాలను వివరిస్తారని చెప్పారు. గత సదస్సుల్లో సుమారు 1,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ సదస్సులో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ విధానాలు, వాటి ప్రయోజనాలు, చికిత్సలో ఎదురయ్యే సమస్యలు, సంక్లిష్టమైన హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలపై ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నారు.