లైబ్రరీలకు హాలీడే మార్చాలి
గ్రంథాలయాలకు(libraries) ప్రస్తుతం ఆదివారం రోజు సెలవు(Sunday holiday) దినంగా పాటిస్తున్నారు. ఫలితంగా అదే రోజు హాలీడే ఉన్న కొందరు ఉద్యోగులు, విద్యార్థులు గ్రంథాలయాల సేవలను(Library services for employees and students) పొందలేకపోతున్నా రు. ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీలకు శుక్రవారం సెలవు పాటి స్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శుక్రవారమే సెలవుగా ఉండేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ నిబంధన మారింది.
అది ఎవరు మార్చారో గానీ, ఉద్యోగులు, విద్యార్థులు వాటి గ్రంథాల యాల ప్రయోజనం పొందలేకపోతున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేవర్ అయ్యేవారు కూడా అసంతృప్తితో ఉన్నారు. కావున, ప్రస్తుతం ఆదివారం ఉన్న సెలవును మరో రోజుకు మార్చాలి. ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్