ఒంటరి వ్యక్తులకు బీమా వర్తింపజేయాలి
సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్
జగిత్యాల, నవంబర్ 24 ( విజయ క్రాంతి ): ఒంటరి మహిళలకు, పురుషులకు, వితంతువులకూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Life Insurance) సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్(Telangana All Senior Citizens Association) జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ప్రభుత్వంను కోరారు.
మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కా ర్యాలయంలో ఒంటరి వ్యక్తుల సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో ఎవరూ లేని ఒంటరి వ్యక్తులకు ప్రభుత్వ తోడ్పాటు తప్పనిసరన్నారు. కాని నామీనీ వివరాలు లేని కారణంగా వారి దరఖాస్తులను ఆన్ లైన్ అనుమతించడం లేదన్నారు. అయితే ఒంటరి వ్యక్తులు తమ బంధువులను నామినీగా పెట్టుకునే వెసులుబాటు కల్పించడం లేదా.
ఒంటరి వ్యక్తుల కోసం ప్రత్యేక నిబంధన తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలని, జిల్లాల్లో ఒంటరి వ్యక్తుల సంఖ్య పరిమితంగానే ఉన్నందున వారికి ఇందిరమ్మ ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించేట్లు చేయించాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ సిటిజెన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సి. హన్మంత్ రెడ్డి, జిల్లా సహాయ అధ్యక్షులు బొల్లం విజయ్, ఉపాధ్యక్షులు ఎం. డి. యాకూబ్, సంయుక్త కార్యదర్శి నాయిని సంజీవ రావు, ఒంటరి వ్యక్తుల ప్రతినిధులు తోట భూమరాజం, దామోదర్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.