జిల్లా స్థాయి టోర్నమెంట్ సెలక్షన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

30-10-2026 | 08:00pm

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో ఎస్కెఎన్ఆర్ డిగ్రీ కళాశాల(SKNR Degree College) నిర్వహిస్తున్న పీఎం శ్రీ జగిత్యాల జిల్లా స్థాయి టోర్నమెంట్(PM Shri Jagitial district-level tournament) సెలెక్షన్స్ బాయ్స్, గర్ల్ విభాగాల్లో క్రీడా పోటీలను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్(Jagitial MLA Dr. Sanjay Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ క్రీడాకారులను అభినందించి, క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, కౌన్సిలర్లు చీటి లక్ష్మీనారాయణ, కూతురు రాజేష్, పిట్ట ధర్మరాజు, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ చక్రధర్ రావు నోడల్ అధికారి శ్రీనివాస్ వేణు భాస్కర్,  నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు