చేయూత పింఛన్ పత్రాల పంపిణీ

26-11-2026 | 09:59pm

మల్లాపూర్, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme), చేయూత పింఛన్ల కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ నాయకుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, వార్డు సభ్యులు,గ్రామస్తులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు