భారత రాజ్యాంగం గొప్పది
రాజాపూర్ నవంబర్ 26: భారత రాజ్యాంగం(Constitution of India) ప్రపంచంలోన్ని దేశాల రాజ్యాంగం కంటే గొప్పదని దానిని అందరూ గౌరవించాలని మండల విద్యాధికారి సుధాకర్(Education Officer Sudhakar) అన్నారు. గురువారం తిరుమలాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని తెలిపారు. విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత వివరించారు.రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుందర్ పాల్,చెన్నయ్య, రామచందర్,జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.