వెల్గటూర్ మండల కేంద్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

18-10-2026 | 08:49pm

ఘనమైన ఏర్పాట్లు చేసిన సర్పంచ్ కవిత గోపి 

ధర్మపురి,అక్టోబర్18(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు(Saddula Bathukamma Celebrations) వెల్గటూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ నిమజ్జనానికి సర్పంచ్ బండమీద కవితగోపి ఘనమైన ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఘాట్ల వద్దు లైటింగ్ ఏర్పాటుతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తెతెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో(devotional), ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, లయబద్ధంగా అడుగులు వేస్తూ సందడి చేశారు. పూల సోయగాలతో మండల కేంద్రం పండుగ శోభను సంతరించుకుంది. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రత్యేకతను, ఆడపడుచుల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.

సద్దుల బతుకమ్మ వేడుకలతో వెల్గటూర్ మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు