నూతన రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు
27-11-2026 | 12:37pm
బచ్చన్నపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలో నూతనంగా వేసిన నేషనల్ హైవే 365బి(National Highway 365B) రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడంతో తరచూ ప్రమాదాలు(Accidents) జరుగుతున్నాయి. కొత్త రోడ్డు కావడంతో స్థానికులు, బయటి వాహనదారులు వేగంగా వెళ్తున్నారు. దీంతో రోడ్డు దాటే వారికి, పిల్లలకు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉంది.అధికారులు స్పందించి వెంటనే స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని బచ్చన్నపేట యువకుడు కర్రే సురేష్ కోరారు.