ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
భూత్పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Jeevitha Bima Scheme) లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఐదవ వార్డు కౌన్సిలర్ కేంద్యాల పద్మ అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) పరిధిలోని ఐదో వార్డులో పోచమ్మ టెంపుల్ దగ్గర ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారని ప్రతి ఒక్కరూ వచ్చి దరఖాస్తులను చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రమ్మ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అరులైన వారు అవసరమైన వివరాలు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.