అలంపూర్‌లో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

27-11-2026 | 12:23pm

అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని(Bala Brahmeswara Swamy) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి సీతక్కకు అర్చకులు పూర్ణకుంభంతో పాటు మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయాల విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను మంత్రికి వివరించారు. పూజల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి, స్వామివారి చిత్రపటాలతో పాటు తీర్థప్రసాదాలను మంత్రికి అందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ సరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, కృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు