అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్కు కొత్త జోష్
చైర్మన్గా మాళోతు హనూమ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
మఠంపల్లి,(విజయక్రాంతి): అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్కు కొత్త కమిటీ కొలువుదీరింది. శుక్రవారం రైతుల సంపూర్ణ మద్దతుతో చైర్మన్గా మాళోతు హనూమ నాయక్(Malothu Hanuma Naik) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మఠంపల్లి మండల పరిధిలోని అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ(Amaravaram Lift Irrigation Committee)కి చైర్మన్తో పాటు డైరెక్టర్లు గా బానోతు హనూమ, పటేటి కృష్ణ, నారపరెడ్డి, ఉస్తల వెంకట్ రెడ్డి, అంతోని,రైతులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రైతుల నమ్మకాన్ని చాటుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్లు బానోతు అరుణాదేశ్ పాండునాయక్ మాలోతు సక్రునాయక్ సమక్షంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను ఆన్ చేశారు. దీంతో సాగునీటి సరఫరా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సహాకారంతో లిఫ్ట్ ఇరిగేషన్ ను సమర్థవంతంగా పొలాలకు నీరు పారుదల అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు.రైతుల ఏకగ్రీవ తీర్పుతో బాధ్యతలు చేపట్టిన నూతన కమిటీ సాగునీటి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయాలని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.ఈ కార్యక్రమంలో పెదవీడు లిఫ్ట్ చైర్మన్ కర్రీమ్, ఉపసర్పంచ్ మల్ రెడ్డి వీరారెడ్డి,మాజీ సర్పంచ్ జోజప్ప,మాజీ నీటి సంఘం చైర్మన్ సోముడు,వెంకట్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, లాలు నాయక్,రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.