ఈ నెల 29న కార్తీక దీపోత్సవం

27-11-2026 | 12:29pm

పోల్సాని సుగుణాకర్ రావు

ముకరంపుర,(విజయక్రాంతి): ఈనెల 29న 5వ కార్తీక దీపోత్సవం(Karthika Deepotsavam) నిర్వహిస్తున్నామని పోల్సాని సుగుణాకర్ రావు తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పోల్సాని సుగుణాకర్ రావు(Polsani Sugunakar Rao) కరీంనగర్(Karimnagar) నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల 29న 5వ కార్తీక దీపోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు.

భక్తులు గోదావరి తీరాలకు, మరో చోటికి వెళ్లకుండా ఇక్కడే దీపోత్సవం జరుపుకునే అవకాశం కల్పిస్తున్నామని నూనె, దీపం, ప్రమిదలు తామే అందజేస్తామని చెప్పారు. భజనలు, భక్తి గీతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని, 4 నుంచి 5 వేల మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమేనని కావున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంప జగన్, దుర్గ మారుతి, తాడూరి బ్రహ్మం, సతీష్, ఆనంద్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు