డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకే ఇవ్వాలి - సీపీఎం దీక్ష

13-09-2026 | 08:46pm

జనగామ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మూడవ విడత ఇందిరమ్మ స్థలాల్లో కట్టిన డబుల్ బెడ్రూం(Double bedroom)ఇండ్లను 72 మంది అసలైన లబ్ధిదారులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జనగామలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలను సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ ప్రారంభించారు. 2012లో 1144 మందికి ఇందిరమ్మ పట్టాలు ఇచ్చినా రుణాలు ఇవ్వకపోవడంతో ఇల్లు కట్టుకోలేకపోయారని, 2023లో 72 మందికి డ్రా తీసి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించినా ఇప్పటివరకు అప్పగించలేదని విజేందర్ ఆరోపించారు. వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు