రామేశ్వర్‌పల్లి, అయ్యవారిపల్లిలో కాంగ్రెస్ నూతన కమిటీల ఎన్నిక
భిక్కనూర్, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): భిక్కనూర్(Bhikkanur) మండలం రామేశ్వర్‌పల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. రామేశ్వర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మద్ది కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల జనరల్ సెక్రటరీగా బత్తిని రాజేందర్, రామేశ్వర్‌పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒల్లెపు శశికుమార్, బీసీ సెల్ అధ్యక్షుడిగా ధర్మస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గడ్డం లింగం, కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పైల్ల రమేష్‌రెడ్డిని నియమించారు.
అయ్యవారిపల్లిలో సీనియర్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా బర్లా పెంటయ్య, ఉపాధ్యక్షుడిగా బర్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా లస్మయల స్వామి, కార్యదర్శిగా బర్ల స్వామి, కోశాధికారిగా బుచ్చయ్యను నియమించారు. నూతన కమిటీ సభ్యులను నాయకులు శాలువాలతో సత్కరించి అభినందించారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు ఏనుగు శ్రీనివాసరెడ్డి, వీఢీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్‌రెడ్డి, వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.